ప్రాంతీయం

అవగాహన సదస్సు కార్యక్రమం…

159 Views
ముస్తాబాద్ నవంబర్ 30 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతుగల్ గ్రామంలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం చేశారు. అందులో భాగంగా భారతి ఫౌండేషన్ వారి సహకారంతో ప్రముఖ కౌన్సిలర్ ఇజాజ్ అహమ్మద్ చే తల్లిదండ్రులకు విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనదని విద్యార్థులకు చేతి వ్రాత అందంగా ఎలా రాయాలో నేర్పించడంలో కౌన్సిలర్  మాట్లాడుతూ పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని, సమయానికి పాఠశాలకు పంపాలని, పిల్లలను అతి గారాబం చేయకూడదని  గురుభక్తి, పెద్దల పట్ల గౌరవం, దేశభక్తి పెంపొందించుకోవాలని అలాగే సూర్యోదయం కంటే ముందే పిల్లలను లేపాలని, పిల్లల ముందు తల్లిదండ్రులు కలహించుకోకూడదని వివరించడం జరిగింది. చక్కటి పద్యాలతో, చిన్నచిన్న కథలతో మంచి వాక్చాతుర్యంతో వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సురభి రాధా కిషన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ఎదగాలంటే తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం అని, మీ సహకారం మాకు ఎల్లవేళల అవసరమని కోరడం జరిగింది.
 పోతుగల్ గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు  మాట్లాడుతూ పిల్లలు బాగా చదివి గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. వార్డ్ మెంబర్ రాజు మంచి క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. ఇట్టి సమావేశంలో ఎంపిటిసి కొండని బాలకిషన్, ఎస్ఎంసి వైస్ చైర్మన్ అనిత శ్రీనివాస్, వార్డెన్ కరుణాకర్, భారతి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీదీక్ష, బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్