ప్రాంతీయం

స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం.. ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్

123 Views

ఈరోజు అహ్మదీపూర్ గ్రామానికి చెందిన టప్ప రాములు అనే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగ వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం విషయన్నీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గౌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ టి హరీశ్ రావు గారికి తెలియచేయగా వారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 100000( loc )కాఫీని మంజూరు చేయించగా ఈరోజు బాధితుని కుమారుడు వెంకటేశ్ కి అందచేయడం జరిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని అన్నారు.సీఎం కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచమే అని అందుకు అనుగుణంగానే ఈరోజు ఆరోగ్య తెలంగాణగా మార్చడంలో వేగంగా అడుగులు పడుతున్న విషయాన్ని వారు స్పష్టంచేశారు. కేసీఆర్ కిట్ , న్యూట్రిషన్ కిట్, పేద విద్యార్థులకు అందుబాటులో వైద్య కళాశాలలు నెలకొల్పుతూ వివిధ ప్రయత్నాలతో, పథకాలతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు తెస్తున్న సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు అని తెలిపారు..అదేవిధంగా

అందుబాటులో ఉచిత ప్రాథమిక పరీక్షలు
తెలంగాణ డయాగ్నస్టిక్స్
దేశంలో తొలిసారిగా ఉచిత వైద్యపరీక్షలు
పేదలపై ఆర్థికభారం తగ్గిస్తూన్నా ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు.
వైద్యారోగ్యశాఖలో వినూత్న, విప్లవాత్మక మార్పులు చేపడుతూ
సర్కార్ వైద్యం మీద ప్రజల్లో విశ్వాసం పెరిగిలా చేసి
కేసీఆర్ కిట్స్‌తో సర్కార్ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు అన్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ చరిత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో మంత్రి హరీష్ రావు గారు రేయింబవళ్లు కష్టపడుతున్నారని ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకు నిరంతరం శ్రామిస్తున్న విషయాన్ని వారు తెలిపారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ప్రభుత్వ దవాఖానలకు గతానికి భిన్నంగా రోగులు వస్తున్నారని, సాధారణ ప్రసవాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. ప్రైవేటు దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను విస్తరింపజేస్తున్నారాని తెలిపారు. ఇటీవలే పేద ప్రజలకు అందుబాటులోకి పల్లే దవాఖానలు ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని వారు స్పష్టంచేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట బిఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Gangolla Sreenivas gajwel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *