ఏమమ్మా… బాగున్నారా… అంతా బీర్నీస్ పంటనే పెట్టినవ్ ఎందుకని ఇందుప్రియాల్ గ్రామ శివారులో కూరగాయలు పండిస్తున్న పొలం చూసి మంత్రి పొలం బాట పట్టారు. మంత్రి మా పొలంకు రావడమేంటనీ ఆశ్చర్యంగా చూస్తూనే… బీర్నీస్ పంటకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది సారూ అంటూ మహిళా రైతు మంత్రికి బదులిచ్చింది. మరీ గిట్టుబాటు అయితుందా… మీరు ఎంత మంది పనోళ్ళను పెట్టుకున్నవా… అని ఆరా తీయగా… లేదు సార్ అత్త, కోడలు, బిడ్డ అందరూ కలిసి పండిస్తున్నామని, ఇంతకు మునుపు నీళ్ల బాధ, కరెంటు బాధ ఉండేదనీ, ఇప్పుడు పక్కనే కాలువ పోతుందని నీళ్ల బాధ తప్పిందని, ఫుల్ కరెంటు మోటారు పెట్టి నీళ్లు వాడుకుంటున్నామని బదులిచ్చింది. కేసీఆర్ సార్ పుణ్యమా అని కరెంట్ ఫుల్, నీళ్లు ఫుల్ గా వచ్చినయ్ అంటూ సంబురంగా చెప్పుకొచ్చింది. ఆ చుట్టూ పక్కల పొలాల్లో కూడా అందరూ బీర్నీస్ పంట పండించడం వారితో కాసేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ మేరకు బీర్నీస్ మంచిగ పండింది సారూ అంటూ ఆప్యాయంగా కూర వండుకోమని మంత్రికి బీర్నీస్ కూరగాయలు అందించగా ఆత్మీయంగా మంత్రి స్వీకరించారు.
