ప్రాంతీయం

విజ్ఞాన్ హైస్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాలు

68 Views

ఎల్లారెడ్డిపేట మండలం లోని విజ్ఞాన్ హై స్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై రమాకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తాగి వాహనాలు నడపరాదని మైనర్ లు డ్రైవింగ్ చేయరాదని అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఒక వాహనంపై ముగ్గురేసి ప్రయాణం చేయకూడదని తల్లితండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇచ్చి ఏదైనా ప్రమాదం జరుగుతే వారికి బాధనే మిగులుస్తుందని విజ్ఞాన్ హై స్కూల్ లో జరిగిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో ఎస్సై రమాకాంత్ విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ స్కూల్ యజమాన్యం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7