రాయపోల్ మండలంలోని పీఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పీఎంపి, ఆర్ఎంపి సభ్యులు హాజరై మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. పీఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ మండల అధ్యక్షులుగా ఎర్రోళ్ల మల్లేశం, ఉపాధ్యక్షులు ఎం.మహిపాల్, కార్యదర్శి కె.మహిపాల్, క్యాషియర్ జోన్నోజు నాగులు, సలహాదారులు గాల్ రెడ్డి, మల్లేశం, ప్రసాద్ గౌడ్, బాలచారి, వెంకటేశం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ పీఎంపి, ఆర్ఎంపి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పీఎంపి, ఆర్ఎంపిల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.
