సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం దౌలపూర్ లో శుక్రవారం పాండురంగ ఆశ్రమం శత కోటి హరేరామ జప యజ్ఞం నగర సంకీర్తన,అఖండ భజన కార్యక్రమం ఘనంగ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ పాల్గొన్నారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ హరే రామ నగర సంకీర్తన పాండు రంగ ఆశ్రమం వారి అధ్వర్యంలో గొప్పగా నిర్వహిస్తున్నారని అందులో జగదేవపుర్ మండల ఆర్యవైశ్య బృందం అగ్ర భాగాన నిలిచి రామ నామాన్ని విస్తరిస్తూ గొప్ప సందేశం ఇస్తున్నారని దౌలపురం గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శతకోటి హరేరామ నామ జప యజ్ఞం నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో పెద్ద యెత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు




