ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ సమీప ప్రాంతం కర్ణాటక సరిహద్దుల ఉన్న మహిమాన్వితమైన జరా సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాచారం కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. కైలాసపురం భక్త బృందం సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం డాక్టర్ వంగపల్లి మాట్లాడుతూ కృతయుగంలో కుపేంద్ర అనే ఒక రాజు చర్మవ్యాధితో బాధపడుతున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చి కేతకీ వనంలోని నీటి గుండంలో స్నానం చేయగా రాజుకు పూర్తిగా స్వస్థత చేకూరింది. అదేరోజు రాత్రి సంగమేశ్వరస్వామి రాజు కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, దానిని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడు. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించాడు. దేవాలయనికి వెనుకభాగంలో పెద్ద గుండం ఉండటం కాశీలో ప్రవహించే గంగా నది ఝరా (జలం) భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఈ గుండానికి ఉన్న గోడకు ఒక రంధ్రం ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేసి, స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా అది నీటితోపాటు ఆ రంధ్రం నుండి వెళ్ళిపోతుంది. కాసేపటితర్వాత మళ్ళీ ఆ గుండం స్వచ్ఛమైన నీటితో పూర్తిగా నిండిపోతుందని ఇంతటి మహిమాన్విత మయిన దేవాలయాన్ని ప్రతి ఒక్క భక్తుడు దర్శించి శ్రీ కేతకి సంగమేశ్వరుని ఆశీస్సులు పొందాలని తెలిపారు