ఆధ్యాత్మికం

గణేష్ కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు..

105 Views

(తిమ్మాపూర్ ఆగస్టు 26)

తిమ్మాపూర్ మండల పరిధిలోని వివిధ గ్రామలకు చెందిన గణేష్ కమిటీ సభ్యులు నిర్వహణ పై సోమవారం అవగాహన కల్పించారు..

తిమ్మాపూర్ సిఐ స్వామి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన గణేష్ కమిటీ సభ్యులకు వినాయక చవితి పండుగ నిర్వాణపై నియమ నిబంధనల గురించి వివరించారు…

ఈ సందర్బంగా సీఐ స్వామి మాట్లాడుతూ..

గణేష్ మండపాలు రోడ్డుకి అడ్డంగా ప్రజలకు,వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని,అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ, నిమార్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వాహకులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.అదేవిధంగా రోడ్లు బ్లాక్ కావడం, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా చేసుకోవాలని,గణేష్ మండపం వద్ద ఏదైనా అనుకోని ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరగకుండా వాటర్ డ్రమ్ములు, ఇసుక బకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని కమిటీ సభ్యులకు సూచించారు.ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు విజయవంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు..

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎస్ఐ బెల్లం చేరాలు, వినాయక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found