ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 3, ఎక్కడ చిక్కదు నీరు ఎండిపోయె నోరు మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు నీరు లేక అల్లాడిపోయిన రోజులు చూసాము మండు వేసవిలో గత 8 సంవత్సరాల క్రితం కానరాని నీరు ఇప్పుడు ఈతెలంగాణలో జలకల సంతరించుకుంది సీఎం కేసీఆర్ చేసిన ఆశయాలను మరువలేనివని ఎంపీపీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ (తాగు,సాగు) నీరు పథకంతో పాటు తదితర పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు నింపుకుంటూ ముస్తాబాద్ కు ఆయా గ్రామాల నుండి మొఱ్ఱైపల్లె గ్రామ శివారులోని లింగంకుంటకు మల్లన్నసాగర్ నీళ్లు చేరుకున్నాయి. ఇక మూడురోజుల్లో ముస్తాబాద్ పెద్ద చెరువుకులోనికి పెద్ద చెరువు ద్వారా తూముల వదిలి ఎల్లమ్మ వాగు, నక్క వాగుకు జలకల సంతరిస్తుందని తద్వారా ఆయా గ్రామాల రైతులకు బోర్ బావుల్లోనికి భూగర్భ జలాలు పడిపోకుండా నిలువరించడానికి అన్నంపెట్టే అన్నదాతలు ఆనందంతో ఉండాలని ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు ఒక ప్రకటనలొ తెలిపారు.
