Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి …

196 Views

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి

మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి వీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కొనియాడారు. బహుభాషా వేత్తగా రాజకీయ దురంధరుడు గా,మృదుస్వభావిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, గిరిధర్ రెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి,నాయకులు గంట బుచ్చ గౌడ్, తిరుపతి గౌడ్ ,కోనేటి పోచయ్య ,లక్ష్మీ నరసయ్య ,చెన్ని బాబు, తిరుపతి ,రమేష్, గుండాడి రామ్ రెడ్డి , బి పేట రాజు ,రమేష్, అంగూరి బాబు, రవి, తిరుపతిరెడ్డి,ఎండి ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *