ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పల్లాకు లేదు
రైతుల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కొమ్మూరిదే
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మురవి
సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గాని జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని విమర్శించే నైతిక హక్కు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గోదావరి ఎస్ఆర్ఎస్ పి అధికారులను ఆదేశించిన వెంటనే తపాస్ పల్లి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసి డ్యాం ను నింపారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొమ్మురవి మాట్లాడుతూ.. తపాస్ పల్లి జలాలను ఆలేరు నియోజకవర్గానికి మళ్లించడం లేదని కాదల్చుకొని టిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై కొమ్మురవి పైర్ అయ్యారు. గత పాలకుల నిర్లక్ష్యం వలెనే తపాస్ పల్లి రిజర్వాయర్ నీటి జలాలు సిద్దిపేటకు తరలించడంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్య పాత్ర పోషించారని అలాంటి నాయకులు తపాస్ పల్లి డ్యాం గురించి కానీ నీటి జలాల గురించి మాట్లాడడం సిగ్గుచేటని హెచ్చరించారు. ఆనాడు లేని సోయి ఈనాడు రావడం దయ్యాలకు వేదాలు వల్లించినట్లుగా ఉందని కొమ్మురవి ఆశ్చర్యపోయారు. రైతులు రాజును చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని అందుకు 18,000వేల కోట్ల రుణమాఫీ దిశగా చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆనాడు ఉన్న ఎమ్మెల్సీ నేటి ఎమ్మెల్యేగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆనాడు గోదావరి జలాలను మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పాదాలు కడిగి నీళ్లను మళ్లించి ఇక్కడి రైతుల పొట్టను కొట్టిన ఘనతను మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఇలాంటి అనవసరపు మాటలు మాట్లాడితే రైతులే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ ప్రాంత రైతంగానికి ప్రజలకు మీరు చేసిన అరాచకాలు, అవినీతి జలదోపిడి అన్ని ఆధారాలు ఉన్నాయని సరైన సమయంలో గుణపాఠం చెపుతామని పేర్కొన్నారు. ఇకనైనా దొంగ ప్రకటనలు మానుకొని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములై నిజాయితీని చాటుకోవాలని తెలిపారు. లేదంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని తెలిపారు. ఈ సమావేశంలో, పట్టణ అధ్యక్షులు మంచాల చిరంజీవులు, పిఎసిఎస్ చైర్మన్ మేరుగు కృష్ణ, కౌన్సిలర్ తార -యాదగిరి, పిఎసిఎస్ డైరెక్టర్ మాధవరెడ్డి,రాంపూర్ మాజీ సర్పంచి శంకర్ గౌడ్,వేచరేణి మాజీ సర్పంచి జ్యోతి- వెంకటేష్,భూమని బాలరాజు, బండ కనకయ్య, తాళ్లపల్లి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.





