
పాఠశాల స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఐదవ తరగతి విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠశాలలో మిగతా విద్యార్థులకు విద్యాబోధన చేశారని రామారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వామి గౌడ్ అన్నారు. మంగళవారం రాయపోల్ మండలంలోని రామారం ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు స్వామి గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించి విద్యార్థులకు స్వయంగా ఉపాధ్యాయుల విధుల పట్ల పాఠశాల విధులు సమాజం తీరు పై అవగాహన కలిగే విధంగా నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి మిగతా తరగతి విద్యార్థులకు ఒకరోజు విద్యాబోధన చేయడం జరిగిందన్నారు. ఐదవ తరగతి విద్యార్థులు డీఈవో లాల్ కుమార్, ఎంఈఓ అర్చన, సాయి చరణ్, ప్రధానోపాధ్యాయులు విష్ణువర్ధన్, మిగతా విద్యార్థులు సబ్జెక్టుల వారీగా పాఠ్యాంశాలు బోధించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వామి, స్వాతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




