
జగదేవపూర్ మండల కేంద్రం లోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద భగవత్ యూత్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ములుగు ఆత్మ కమిటీ ఛైర్మెన్ గుండా రంగా రెడ్డి, స్థానిక ఎస్సై కృష్ణమూర్తి, ఎంపీపీ బాలేశం గౌడ్ హాజరైనారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..భగత్ యూత్ సభ్యులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని స్ఫూర్తిగా తీసుకొని అతని అడుగుజాడల్లో యువత నడవాలని, యువత అన్ని రంగాల్లో రాణించాలని, అభివృద్ధి చెందాలని అన్నారు.విగ్రహ దాత ములుగు ఆత్మ కమిటీ ఛైర్మెన్ గుండా రంగారెడ్డి, విగ్రహ గద్దె నిర్మించు దాత టిఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్, సిమెంటు స్టీల్ టైల్స్ నాచారం టెంపుల్ డైరెక్టర్ బుద్ధ నాగరాజు, విగ్రహానికి స్టీల్ మెట్ల దాత సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి , నిర్వాహకులు కొండపోచమ్మ డైరెక్టర్ దాచారం కనకయ్య నాయకులు తమకు సహకరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు, గజ్వేల్ ఏఎంసి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ బింగి మల్లేశం, కొ- ఆప్షన్ సభ్యులు ఎక్బాల్, ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి ,జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు ఆలేటి సంతోష్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొంపల్లి కరుణాకర్, వార్డ్ మెంబర్లు,కొంపల్లి మహేష్, మచ్చ గణేష్, బుద్ధ చిన్న సత్యం, ధనంజయ, పుల్లూరి వెంకటేశం, శివాజీ యూత్ సభ్యులు, భగత్ యూత్ సభ్యుల అధ్యక్షులు ప్రవీణ్ అరవింద్, శివకుమార్ , వంశీ,స్వామి, సాయికిరణ్, సాయి తేజ, వై రాజు, శేఖర్,, చరణ్, గిరి,అభిలాష్ ,రాజ్ కుమార్,మధు, శేఖర్, భాస్కర్, వెంకటేష్, హరి,శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.




