ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 2,
నూతన జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఏ.రమేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం బిసిటిఏ డైరీని అందించి శాలువాతోసత్కరించారు. ఈసందర్భంగా బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఇట్టికార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విక్కుర్తి లక్ష్మీనారాయణ జిల్లా అధ్యక్షులు పులి రామ్ గోపాల్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల సుధాకర్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తాటికొండ కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు.




