శ్రీరామకోటి భక్త సమాజం నిర్వహిస్తున్న కోటి తలంబ్రాల దీక్షలో భాగంగా గురువారం నాడు ఏసీపీ రమేష్ కి తలంబ్రాల ప్యాకేట్ రామకోటి రామరాజు ఇవ్వడం జరిగింది. రామభక్తిలో మేము సైతం అంటూ కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని శ్రీరామ నామాన్ని స్మరిస్తూ గోటితో ఓడ్లను వొలిచి తన భక్తిని చాటుకున్నారు. గజ్వేల్ ఏసీపీ రమేష్. అనంతరం ఏసీపీ రమేష్ మాట్లాడుతూ శ్రీరామకోటి భక్త సమాజం సంస్థను స్థాపించి గత 25 సంవత్సరాల నుండి రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక కృషి అభినందనీయం అన్నారు. రామనామ స్మరణ ఒక కులానికో, మతానికో సంబంధించిన విషయం కాదని రామ తత్వం అనేది విశ్వజనీయమైన రామ నామాన్ని ప్రతి ఒక్కరిచే పలికిస్తూ వారిని తట్టి లేపుతూ గజ్వేల్ ప్రాంతం అంతా రామ మయం చేయడం ఆయన భక్తికి నిదర్శనమన్నారు. అలాగే కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొని గోటితో ఓలిచి అద్భుత కార్యాన్ని రామకోటి రామరాజు శ్రీకారం చుట్టడం ఆనందకరం అన్నారు. భద్రాచలం నుంచి రామకోటి సంస్థకు తలంబ్రాలు రావడం ఈ తలంబ్రాలనే శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ఉపయోగించడం ఇందులో మనమందరం పాల్గొనడం మనందరి అదృష్టమన్నారు.