ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 26, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ గాండ్ల
సుమతి తనభర్త ఈ విషయమై వివరణ ఇస్తూ కొందరు వ్యక్తులు కావాలని దురుద్దేశ పూర్వకంగా రాజకీయ లబ్ధికోసం నాపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. ఇందులో తన భర్త పేరుమీద నిర్మాణ పనులు జరుగుతుండగా సెట్ బ్యాక్ లేకుండా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పంచాయతీ అనుమతితో నిర్మాణ పనులు చేపడుతుంటే అక్రమ నిర్మాణాలంటూ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సర్పంచ్ అన్నారు. కొందరు పార్టీ నేతలు సైతం పట్టణానికి సంబంధంలేనివారు కూడా ఈవిషయంలో తలదూర్చి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నాను తప్ప ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడం లేదని సంబంధిత పత్రాలను చూపిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
