పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి
-టిఆర్ఎస్ నాయకులు రోడ్డుపై నిరసన.
-సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
.రాయపోల్, మేజర్ న్యూస్. 2014లో అచ్చే దిన్ అంటూ అధికారంలోకి వొచ్చిన ప్రధాని నరేంద్రమోదీ నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ..సచ్చే దిన్ గా మార్చారని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి ఆందోళన వ్యక్తం చేసారు.గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా రాయపోల్ అంబేద్కర్ విగ్రహం ఎదుట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఈసందర్భంగా వారు మాట్లాడారు మహిళా దినోత్సవం సందర్భంగా గ్యాస్ ధరలు పెంచుతూ మహిళలకు కానుక ఇచ్చాడని వారు ఎద్దేవా చేశారు. గ్యాస్ ధరలు పెంచడంతో వంట యాదికి వొస్తేనే మహిళలకు కన్నీళ్లు వొస్తున్నాయని, కట్టెల పొయ్యే దిక్కవుతుందని వారు పేర్కొన్నారు.రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని, ఎరువుల, డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం సామాన్యుల హితమే ద్యేయం గా పనిచేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సింది పోయిందన్నారు.బీజేపీ ప్రభుత్వం పేదలకు శాపంగా, కార్పొరేట్ వ్యవస్థకు వరంగా మారిందన్నారు.ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ మేకిన్ ఇండియా విధానంకు చరమ గీతం పడుతున్నారన్నారు.మహిళలు తలుచుకుంటే కానిది లేదని, గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ పాలనకు వొచ్చే ఎన్నికల్లో చరమ గీతం పాడాలన్నారు. నోరు తెరిస్తే తెలంగాణ ప్రభుత్వం మీద అబద్దలతో విమర్శలు చేసే ఎమ్మెల్యే గ్యాస్ ధరల పెంపుపై స్పందించాలన్నారు.ఎన్నికల వేళ మీ గ్రామాల్లో రఘునందన్ ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు.
గ్యాస్ ధరను పెంచిన బిజెపి ని గద్దె దించేవరకు పోరాటం సాగించాలన్నారు.రూ.400 గ్యాస్ సిలిండర్ నేడు రూ. 1175 రూపాయలకు పెంచడం దారుణమన్నారు.
నల్లధనం తీసి గరీబోల్ల ఖాతాల్లో వేస్తానని చెప్పిన మోదీ గారు నేటికీ పైసా వేసింది లేదని, ఆధాని, అంబానీ లాంటి కార్పోరేట్ లకు కోట్లాది రూపాయలు కట్టబెట్టారన్నారు.
వేల కోట్ల విలువ చేసే ఆస్తులను మోడీ అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు..
దేశం మొత్తాన్ని. గుజరాత్ కంపెనీలకే అప్పజెప్పుతున్నారని వారు విమర్శించారు.
దేశంలో నీచ నికృష్టమైన పరిపాలన దేశంలో కొనసాగుతుందన్నారు.
గతంలో పాలించిన బిజెపి నేడు కనుమరుగు అయిందని, మోదీ కార్పొరేట్ దౌర్భాగ్య పాలన సాగుతుందన్నారు.
జాతీయ స్థాయిలో బిజెపి ని గద్దె దించేందుకే బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 6 మాసాల్లో రాజీనామా చేస్తా అన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎటు పోయాడని, ఇంకా 6 మాసాలు పూర్తి కాలేవా అని ప్రశ్నించారు.
జూటా మాటలతో, అబద్ధాలతో గద్దెనెక్కన రఘునందన్ ను ఊర్లల్లో అడుగడుగునా నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షులు రేకులు నరసింహారెడ్డి మున్న ,మండల కోఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్ ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, బి ఆర్ ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కర్నాల సత్యనారాయణ ,దౌల్తాబాద్ మండల ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బండారు దేవేందర్ ,బి ఆర్ ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు హనుమండ్ల రాజిరెడ్డి ,జిల్లా యువజన నాయకులు కల్లూరి శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు కర్ణాకర్ ఆత్మ కమిటీ డైరెక్టర్లు జగపతి రెడ్డి ,మాదాస్ మురళి గౌడ్ ,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల రామా గౌడ్, శ్రీధర్ ,బాబుల్ ,ప్రసాద్, రాజేశ్వర్ రెడ్డి ,నాంసాన్ స్వామి, రాజిరెడ్డి ,జనార్దన్ రెడ్డి, జీవన్ రెడ్డి ,ఆనంద్, కొండర్ గణేష్ ,సత్తుగారి నర్సింహారెడ్డి ,మాధస్ నవీన్, మాజీ రైల్వే బోర్డు మెంబర్ రేకుల లక్ష్మారెడ్డి ,తుప్పత్తి ప్రవీణ్ ,తుడుం ప్రశాంత్ ,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




