ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 2, మరోసారి భారీగా గ్యాస్ ధర పెరగడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మోడీ దిగితే కానీ సామాన్యుడు బ్రతకలేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మార్చి నుండి భారీగా ధరలు పెరిగాయని14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరపై ఏకంగా రూ. 50 రూపాయలు పెంచడంతో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 350.50 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో డొమెస్టిక్ సిలిండర్ ధర 1155 రూపాయలకు చేరింది. ఇక గ్యాస్ సిలిండర్ పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వంపై సామాన్యులు మరోసారి వేడె క్కిపోయారని అన్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశానికి తాకుతుంటే..ఇప్పుడు గ్యాస్ ధర ఏకంగా రూ.50 పెంచడంఫై కేంద్రంఫై నిప్పులు చెరుగుతున్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక మొత్తంలో ఆందోళనలు చేపట్టింది. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు అధికార పార్టీ నాయకులు ముస్తాబాద్ బిఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు గ్యాస్ సిలిండర్లు, కట్టెల పొయ్యితో వంటలు చేసి రోడ్లపైనే టిఫిన్ చేసి అనంతరం కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.అలాగే బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని ఎంపీపీ జనగామ శరత్ రావు అన్నారు. ప్రజలను నిండా ముంచిన బీజేపీని ప్రజలు ఎలా చూస్తారని వెల్లడించారు. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2014లో గ్యాస్ ధర రూ.400 ఉంటేనే బీజేపీ గగ్గోలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరి ఇప్పుడు రూ.1100 దాటిందని, ఆపార్టీ నాయకులు ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో సురేందర్ రావు, జడ్పిటిసి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎద్దండి నరసింహారెడ్డి, అక్కరాజు శ్రీనివాస్, కొమ్ము బాలయ్య, సర్వర్ పాషా, సాదుల్ పాప, శీలం స్వామి, కోడె శ్రీనివాస్, ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాళ్ళు తదితరులు పాల్గొన్నారు.
