రఘునందన్ రావు ప్రశ్నించే గొంతుక నేడు మూగబోయింది
• నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముత్యంరెడ్డిదే
• గతంలో వేసిన రోడ్లపై తట్టెడు మట్టి వేసిన నాథుడే లేడు
• నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకేనా
• గతంలో అభివృద్ధిని చేసింది మేమే మళ్ళీ చేయబోయేది మేమే
• 6 యేండ్ల క్రితం మండల కేంద్రంలో 66 మంది దళితుల ఇండ్లు కూలగొట్టి నేటికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇయ్యలేదు
నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముత్యంరెడ్డిదేనని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గతంలో వేసిన రోడ్లే తప్ప కొత్తగా రోడ్లు వేసిన నాథుడే లేడన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
దుబ్బాక ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే రఘునందన్ రావు గొంతుక నేడు ఎందుకు మూగబోయిందో చెప్పాలన్నారు. నిధులన్నీ సిద్దిపేట,గజ్వేల్ లకు మళ్లిస్తుంటే గెలిచిన ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారని ఎమ్మెల్యే రఘునందన్ రావు అసమర్థత వల్ల దుబ్బాక అభివృద్ధిలో వెనకబడిందన్నారు.గతంలో అభివృద్ది చేసింది కాంగ్రెస్ పార్టీనే అని మళ్ళీ అభివృద్ది కాంగ్రెస్ పార్టీ తోనే సాద్యం అన్నారు. రాయపోల్ మండల కేంద్రంలోని దళితుల ఇండ్లు 6 యేండ్ల క్రితం కూలగొట్టి నేటికీ వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు.దళితుల గోస కెసిఆర్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు.రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హయాంలో మేలు జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కర్నాల శ్రీనివాస్ రావు, పడాల రాములు,భూపతి రావు,కిష్టారెడ్డి,దయాకర్,దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.