రహదారిపై రక్తం ఏరులై ప్రవహిస్తుంది. (దారులు పెద్దగా చేసింది, మా ప్రాణాలు తీయడానికేనా ..అంటున్న ప్రజలు) (రహదారులపై ప్రయాణం మరణశయ్యగా మారిందా?) (సరైన అంబులెన్స్ సౌకర్యం కల్పించక ,ప్రాణాలు రోడ్డుకు బలవుతున్నాయిక్కడ ) (మోకనపల్లి బద్రి) మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో 163 జాతీయ రహదారిపై గత కొంతకాలంగా ప్రయాణికుల ప్రాణాలు రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నాయి, జాతీయ రహదారిపై పనులు పూర్తయిన కూడా.. అందుబాటు లోకి రాని అంబులెన్స్ సేవలు
42 కిలోమీటరు రోడ్ శ్రీరాంపూర్ నుండీ రేపల్లె వాడ వరకు రోడ్ పనులు పూర్తిగా అయినవి, జాతీయ రహదారిపై ట్రాఫిక్ చాల వరకు పెరిగింది ,మందమర్రి సమీపంలో గల టోల్ ప్లాజా వద్ద , రెండు అంబులెన్స్ లు ఉండగా.. ఒకటే అంబులెన్స్ ని , అధికారులు నడిపిస్తున్నారు . ఒకటే అంబులెన్స్ ఏదైనా ఆక్సిడెంట్ అయి వెళ్తే ,అది వచ్చేవరకు వెయిట్ చెయ్యాలి, సరైన టైమ్ లో అంబులెన్స్ రాకుంటే ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.ఇంకో అంబులెన్స్ డేమో టోల్ ప్లాజా లో ఉంచుతున్నారు.
రెండు అంబులెన్స్ సేవలు కొనసాగిస్తే , సరైన సమయంలో అంబులెన్స్ సేవలు అందినట్లయితే వాహనాలు ప్రమాదానికి గురైనా… వాహనదారుల ప్రాణాలు కాపాడవచ్చు, ఈ మధ్య కాలంలో అద్భుతంగా తీర్చి దిద్ద బడిన , ఈ ..రోడ్డుపై అతివేగంగా వాహనాలు నడుపుతూ… ఘోరమైన ప్రమాదాలు ఏదో ఒకచోట విపరీతంగా సంభవిస్తున్నాయి. ఇది అందరికీ తెలిసిందే ,ఇప్పటికైనా.. రహదారి నిఘా.. అధికారులు వెంటనే రహదారిపై ప్రయాణం చేస్తున్న వాహనదారుల ప్రాణాలను కాపాడే దిశగా చర్యలు తీసుకొని, అందుబాటులో ఉన్న, రెండు అంబులెన్స్ లు నడపాలని ప్రయాణికులు ,వాహన చోదకులు ,ప్రజా ప్రతినిధులు ,ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
