బిజెపిలోకి చేరునున్న సినీ నటి ఆమని
హైదరాబాద్ డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7
ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఆమని నేడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆమని కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా, ఆమె అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది.





