గ్యాస్ సిలిండర్ పెట్రోల్, డీజిల్, ధరలు తగ్గించాలి ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన జ్వ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర పెంచినందుకు అదేవిధంగా నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్, ధరలు విపరీతంగా పెంచిన కారణంగా ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి, AMC చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, బి ఆర్ ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షుడు బెండే మధు,బి ఆర్ ఎస్ మర్కుక్ మండల అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్, బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు గడియారం స్వామి చారి, నియోజవర్గ బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, బి ఆర్ ఎస్ మున్సిపల్ అధ్యక్షులు, జడ్పిటిసిలు,. ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు,బి ఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
