అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని బంధనకల్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. కొందరు విద్యార్థులు వంట నిర్వాహకులకు పురుగులను చూపించగా వాటిని తీసేసి తినమన్నారని తెలిపారని ఆరోపణలు. ఇదే విషయాన్ని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకపోయింది. కుళ్లిపోయిన కూరగాయలతో కూర, నీళ్ల పప్పుచారు, సరిగ్గా ఉడకని అన్నంలో పురుగులు.. ఇదేనా మధ్యాహ్న భోజనం అంటూ మాకు ఇంటివద్ద భోజనం లేఖన మాకు వచ్చిన కష్టాలు మాపిల్లలకు రావద్దుని ఎన్నికష్టాలు వచ్చినా పిల్లల కొరకు మేము వెనకాడమని లేదంటే ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తామని విద్యార్థుల తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విద్యాకమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి వెంకట్రావుపల్లి చెందిన తిరుపతిరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పేరెంట్స్ కలిసి విద్యార్థులకు రేపటినుండి మీకు సరిపోయే భోజనం టిఫిన్ బాక్స్ లో తెచ్చుకోగలరని పాఠశాలలో బెల్ కొట్టి ఇంటికి పంపించేశారు ఈఘటనపై పైఅధికారులు తక్షణమే ఎలాంటిచర్య తీసుకుంటారు వేచి చూడాల్సిందే నంటు నూతనంగా భోజనం నిర్వాహకులను ఏర్పాటు చేయాలని తెలిపారు.
