
జగదేవపూర్ మండలం లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కవిత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డితో కలిసి పరిశీలించారు.అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను సందర్శించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




