సిద్దిపేట :సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో బుధవారం రోజున సకాట సీడ్స్ వారి స్వీట్ కార్న్ స్వీట్ క్వీన్ 0174 పైన శ్రీ బట్టు ఎలేందర్ రెడ్డి వ్యవసాయ పొలంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు..సకాట కంపెనీ ప్రతినిధి సంపత్ కుమార్ మాట్లాడుతూ, సకాట వారి స్వీట్ క్వీన్ 0174 అనురకం 70 నుంచి 75 రోజులలో కోతకు వచ్చి 600 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు వస్తుందని,ఈ స్వీట్ క్వీన్ 0174 అనురకం సంవత్సరం పొడువున విత్తుకోవచ్చని పేర్కొన్నారు..రైతు ఎలేందర్ రెడ్డి మాట్లాడుతూ, సకాట వారి స్వీట్ క్వీన్ తక్కువ కాలంలో కోతకు వచ్చి మంచి ఆకుపచ్చ ఆకారం కలిగి,మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ రకంలో 40% వరకు రెండు కంకులు కలిగిఉన్నాయన్నారు..ఈ కార్యక్రమంలో డిబిల్ స్టేషన్ డీలర్స్ మరియు ములుగు మండల రైతులు పాల్గొన్నారు..