ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో ముందుండాలి మంత్రి కేటీఆర్…

256 Views
 ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 28  విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నియోజక వర్గంలో 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్ లను గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో పంపిణీ చేయడం ఆనందంగా వుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఎల్లారెడ్డి పేటలో 7 కోట్లతో ఉన్నత పాఠశాలను,జూనియర్ కాలేజి మైదా నమును మినీ స్టేడియంగా మార్చుతానని హామీ ఇచ్చారు. గ్రామంలోని వేణు గోపాల స్వామి గుడిని 2 కోట్లతో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గంభిరావు పేటలో కే జి  టూ పి జీ విద్యా లయన్ని ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కన్నుల్లో ఆనందం చూడటానికి ట్యాబ్ లను పంపిణీ చేయడం విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వెక్షన్ ప్రోగ్రాంలో జిల్లా ముందుందని అందుకు కృషి చేసిన కలెక్టర్ కు , అన్ని శాఖల అధికారులకు, నేతల కృషి అని మంత్రి తెలిపారు.
విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్ లని దుర్వినియోగం కాకుండా ఉపయోగించుకోవాలి అని కోరారు. త్వరలో వేముల వాడ నియోజక వర్గంలోని విద్యార్థులకు 3 వేల ట్యాబ్ లను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు నీట్,ఐ ఐ టి తో పాటు పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ముందుండాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాబ్ కాబ్ చైర్మెన్ రవీందర్ రావు,జెడ్పీ చైర్మన్ అరుణ,కలెక్టర్ అనురాగ్ జయంతి,డి ఐ జి రమేష్,ఎస్ పి అఖిల్ మహాజన్,సెస్ చైర్మెన్ చిక్కాల రామారావు, ఎంపిపి రేణుక,జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, జిల్లా రైతు బంధు అద్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ చైర్మన్ అకునూరి శంకరయ్య, బి అర్ ఎస్ జిల్లా అద్యక్షుడు తోట ఆగాయ్యా, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, ఎంపిటిసిలు,పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *