మన ఈ స్వేచ్ఛకు కారణమే జవానులు – బాల కిషన్,ప్రధానోపాధ్యాయులు ఎం పి యు పి ఎస్ – అంగడి కిష్టాపూర్
సిద్దిపేట జిల్లా జూలై 26
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ లో వీర జవాన్ లకు వందనం చేస్తూ విద్యార్థులు ఉపాధ్యాయులు క్యాండిల్లతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకిషన్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం జూలై 26 న జరుపుకునే కార్గిల్ విజయ్ దివస్ భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మరపురాని రోజు ఇది 1999 నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పై భారత సాయుధ దళాల విజయాన్ని గుర్తు చేస్తుంది. అంతే కాకుండా ఈ రోజూ దేశ సార్వభౌమత్వంను కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన వీర సైనికులకు అంకితం చేయబడిందని అన్నారు. అనంతరం విద్యార్థులు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడి వీర మరణం పొందిన జవానులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరిక చిన్ని కృష్ణ తదితులున్నారు.
