ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి స్వామి వివేకానంద విగ్రహంవద్ద కొవ్వొతలతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందర్ నాయక్, గురు బాబు మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవన్మరణం గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను కఠినంగా శిక్షించాలి మాఎస్టి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఇప్పటికీ కూడా రాష్ట్రంలో వేరువేరు చోట్ల మహిళల పట్ల విద్యార్థుల పట్ల ఎక్కడో ఒక దగ్గర సీనియర్ల ర్యాగింగ్ లు జరుగుతున్నాయని అన్నారు. అలాగే మా గిరిజనులను అంటే ఇంత చిన్నచూప రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించి ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని కోరుతూ కాలేజీ ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేసి ప్రీతి కేసును న్యాయవిచారణ చేసి వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం అన్నారు. ఈకార్యక్రమంలో డాక్టర్ చందర్ నాయక్, కపూర్ నాయక్, గురు బాబు, విద్యార్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




