ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి కొవ్వొత్తులుతో ర్యాలీ తీసి స్వామి వివేకానంద విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బిజెపి నాయకులు మెంగని మహేందర్ మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక గిరిజన బిడ్డ ధరావత్ ప్రీతి మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను మరెవరైనాసరే వారిని కఠినంగా శిక్షించాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాంమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించి ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారపు సంతోష్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్, ఒరగంటి సత్యం, ఎస్టి మోర్చా ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బాదావత్ నరసింహ, మద్దికుంట రమేష్ తదితరులు పాల్గొన్నారు.




