ముస్తాబాద్, అక్టోబర్5 నూతనంగా నిర్మించిన గూడూరు గ్రామపంచాయతీ భవనంను ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సర్పంచ్ సాకల రమేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసారు. నూతన భవనంలో సర్పంచ్ రమేష్ ను శాల్వాతో సన్మానించారు. అదేవిధంగా మొరాయిపల్లి గ్రామంలో సర్పంచ్ సడుమల సుజాత ఎల్లం, ఉప సర్పంచ్ మెంగని శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. చిప్పలపల్లి గ్రామంలో 1,యాదవ సంఘము భవనం 2,స్కూల్ బిల్డింగ్ భవనం 3,రెడ్డి సంఘము భవనం 4,ప్రగతి ప్రాంగణం భవన భూమి పూజ కార్యక్రమం 5,గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందించారు. 6,డబుల్ బెడ్ రూమ్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, బొంపల్లి సురేందర్రావు, కొమ్ము బాలయ్య, తదితర పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మాజి సర్పంచ్లు, ఉప సర్పంచులు, పలు మండలాల నుండి అధిక మొత్తంలో బిఆర్ఎస్ నాయకులు, అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
