ప్రాంతీయం

ఆటో కార్మికులు అధైర్య పడవద్దు టీఆర్ఎస్ అధినేత్రి కవిత అండగా ఉంటుంది

8 Views

ఆటో కార్మికులు అధైర్య పడవద్దు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత అండగా ఉంటుంది

మీ సమస్యల పట్ల టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది

TS తెలుగు న్యూస్ 24/7: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆటో డ్రైవర్ పాముల భాస్కర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా,ఆ కుటుంబాన్ని మంగళవారం తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు పరామర్శించి సహాయం అందించారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు సతీష్,భాస్కర్,మజీద్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధినేత కవితక్క పిలుపు మేరకు ప్రజలకు సేవ చేయడానికి ముందుండాలనే లక్ష్యంతో నిరుపేద ఆటో కార్మికుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు.ఆటో కార్మికులను ఆదుకుంటామని ప్రభుత్వం, ప్రతిపక్షాలు హామీలు ఇవ్వడం జరుగుతుందని ఆ హామీల ప్రకారం ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు.తండ్రి బాలమల్లు మృతి చెందగా దినకర్మ రోజే పాముల భాస్కర్ ఆత్మ చేసుకోవడం బాధాకరమన్నారు.మృతునికి తల్లి ఎల్లవ్వ, భార్య పద్మ, చిన్నారులు కూతుర్లు భవిష్య , ఆద్య, కొడుకు సామ్రాట్ లు ఉన్నారు.ఈ నిరుపేద కుటుంబాన్ని అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చిఆదుకోవాలని కోరారు.ఆటో కార్మికులు అధైర్య పడవద్దనీ టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత మీ సమస్యల పట్ల పోరాడుతూ మీకు అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సయ్యద్ జావిద్,అశోక్,భూపతి,ఉమేష్,రఫీక్,రమేష్,మోమిన్,బద్రి,మౌల,దేవరాజు,యూసుఫ్, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు,షారుక్,మర్తన్నపేట సత్తయ్య గౌడ్,పాష,మహమధ్,ఆటో కార్మికులు ఆరేటి సంతోష్,కదిర రవి,రేండ్ల దేవయ్య,పిల్లి సమ్మీ, పాముల భాను,సతీష్,సాగర్,రవి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *