ప్రాంతీయం

గురుకులాల్లో 5.వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

280 Views

ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, ముస్తాబాద్ తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ గురుకుల గిరిజన గురుకుల, బి.సి గురుకుల,జనరల్ గురుకుల విద్యాలయలో(ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్) 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ముస్తాబద్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ఉదయ్ కుమార్ తెలిపారు. ప్రవేశమునకై తేదీ 23/04/2023 నాడు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రవేశ పరీక్షా నిర్వహించబడును అని విద్యార్థులు నాలుగవ తరగతిలో ఉతీర్ణత అయి ఉండాలని ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు తేదీ 06/03/2023 లోగా ఆన్ లైన్ లో రు.100/చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు.

ఈధరఖాస్తు ఒక సెల్ ఫోన్ నంబర్ తో ఒక దరఖాస్తు మాత్రమే అప్లై చేసుకునేందుకు వీలుంటుంది. అని కూడా తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *