ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలలో నట్టల నివారణకు పశు సంవర్ధక శాఖవారి ఆధ్వర్యంలో సర్పంచ్ గణప శివజ్యోతి, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మందులు వేశారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, పసుల శేఖర్ బాబు బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి, బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గనుప మదన్ రెడ్డి, వెటర్నరీ డాక్టర్లు సంతోష్, కరుణశ్రీ, అసిస్టెంట్ రాజశేఖర్, బండి రమేష్, దేవయ్య, గుంటి శ్రీను, మ్యాకల కుంటయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




