తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీసీ బందు పథకం ద్వారా విశ్వనాధుల వినయ్ ఏర్పాటు చేసిన కార్పెంటరి వర్క్ షాప్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించిన ఎంపీపీ పడిగెల మానస రాజు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతమయ్య దిశగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.సబ్బండ వర్గాల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎల్లవేళలా అండగా నిలవాలని ఈ సందర్భంగా ఎంపీపీ మానస తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, ఎంపీటీసీ కోడి అంతయ్య,బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రాఘవేంద్ర,సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, వార్డు సభ్యులు రెడ్డి పరశురాములు, మైనార్టీ నాయకులు ఎండి హమీద్, షేక్ అబూబకర్, బిఆర్ఎస్ నాయకులు విశ్వనాథ రమేష్, నాయకులు మచ్చ శ్రీనివాస్,విశ్వనాథుల మారుతి తదితరులు పాల్గొన్నారు
