పాలిటివ్ కేర్ మరియు హెల్ప్ డెస్క్ నియోనెంటల్ కేర్ సెంటర్ ను అకస్మికంగా సందర్శించి తగు సూచనలు చేసిన డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎస్ అనిత.
మంచిర్యాల జిల్లా.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని పాలిటివ్ కేర్ మరియు హెల్ప్ డెస్క్ నియోనెంటల్ కేర్ సెంటర్ అకస్మికంగా సందర్శించి తగు సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. పాలిటివ్ కేర్ మరియు కీమోథెరపీ సెంటర్లను సందర్శించి పాలిటివ్ కేర్ ద్వారా ఉపశమనం కోసం రోగులకు అందిస్తున్న వైద్య సేవల పైన ఆరాధిసినారు అదేవిధంగా ఇప్పటివరకు నెలకు ఎంతమందికి చికిత్స చేస్తున్నారు వాటి వివరములను పరీక్ష చేయడం జరిగినది. అదేవిధంగా జిల్లాలో కీమోతెరపి కోసం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు క్యాన్సర్ రోగులను గుర్తించి వివరములను అందజేయాలని ఆదేశించినారు హెల్ప్ డెస్క్ ద్వారా వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండడము మరియు మాతా శిశు కేంద్రములకు వచ్చే గర్భవతులను బాలింతలను చిన్నపిల్లలను తల్లులను సమన్వయం చేసుకుంటూ వారికి సరైన రీతిలో వైద్య సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని వివరములను రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించినారు గర్భవతులు ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అయినప్పుడు వారి వివరములను ఫోను నంబర్లను ఇంటివారివి దగ్గర ఉంచుకుని వారికి తగు సూచనలు పరీక్షలు అందే విధంగా కోఆర్డినేషన్ ద్వారా చర్యలు చేపట్టాలని హెల్ప్ డెస్క్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగినది మరియు నవజాత శిశువుల సంరక్షణ కేంద్రం ను సందర్శించి వైద్యులు వైద్య సిబ్బంది ద్వారా అందిస్తున్న సేవలను పరీక్ష చేయడం జరిగినది ముఖ్యంగా హెల్ప్ డెస్క్ సిబ్బంది పాలిటివ్ కేర్ సిబ్బంది కీమోథెరపీ సెంటర్లో ని సిబ్బంది వైద్యులు ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించాలని రోగులకు సరైన రీతిలో వైద్య సేవలు అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించినారు ప్రజలలో పాలిటివ్ కేర్ ద్వారా అందిస్తున్న వైద్య సేవల పైన అవగాహన కలిగించాలని జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ కు ఆదేశించినారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ హెల్ప్ డెస్క్ సిబ్బంది నర్సింగ్ సిబ్బంది డి పి హెచ్ ఎన్ పద్మ మార్త వసుమతి పాల్గొన్నారు.
వైద్య కార్యక్రమాల పైన అవగాహన కలిగించాలని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రత్యేక వైద్య నిపుణుల ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి తెలియజేయాలని కోరినారు సాధారణ ప్రసవాలు చేసుకునే వారికి పూర్తి సహకారం అందించాలని వారి ఇంటి సభ్యులకు ప్రసవాల పైన అవగాహన కలిగించాలని ఆదేశించినారు.





