
– రాజన్న సిరిసిల్ల కు ప్రథమ స్థానం జిల్లా గర్వకారణం
– ట్విట్టర్ వేదికగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి మంత్రి కే టి కేటీఆర్ అభినందనలు గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్-2023 త్రైమాసిక ఫలితాల్లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల మరోసారి మెరిసింది.
ఫోర్త్ స్టార్ కేటగిరిలో తొలి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా, మూడోస్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది.
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీవోలు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌కు అభినందనలు తెలిపారు. అలాగే త్రీ స్టార్ కేటగిరిలో ఒకటి, రెండు స్థానాలను సిద్దిపేట, జగిత్యాల జిల్లాలు దక్కించుకున్నాయి.
*సమిష్టి కృషి వల్లే మొదటి స్థానం:జిల్లా కలెక్టర్*
గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షన్-2023 త్రైమాసిక ఫలితాల్లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల కు మొదటి స్థానం దక్కడం పట్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హర్షం వ్యక్తం చేశారు.
మంత్రి కే టి ఆర్ మార్గదర్శనం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం , పంచాయితీ అధికారులు , సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల కృషి వల్లే దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.





