మంచిర్యాల జిల్లా.
జమ్ముకాశ్మీర్ పహల్గంలోని పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకొని వారిపై జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తూ..
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని నిరసన ర్యాలీ.
ఏఐసీసీ పిలుపు మేరకు.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు.
మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ నుండి ఐబీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ గా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించడం జరిగింది.
అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ పలు ప్రాంతాల నుండి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదుల చర్యను ఖండించారు.మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
