భద్రాచలం దేవస్థానం ముత్యాల తలంబ్రాలను ఆదివారం నాడు అద్దాల మందిరం వద్ద శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామారాజు గారు పూజలు జరిపి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ పాత్రికేయులకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ చాలా విశిష్టత కలిగినటువంటి తలంబ్రాలే ఈ భద్రాచల ముత్యాల తలంబ్రాలు అని అన్నారు. పాత్రికేయులకు ముత్యాల తలంబ్రాలతో పాటు స్వామి వారి శేషవస్త్రాలు అందించారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ శ్రీరాముడు మీకు ఎల్లవేళలా రక్షణగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ సాక్షాత్తు భద్రాచల ముత్యాల తలంబ్రాలు రామకోటి రామరాజు కృషి, పట్టుదల వల్ల మాకు అందడం చాలా ఆనందంగా ఉందన్నారు.
