ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా అదివారం మంత్రి జగదీష్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ,తదితరులు ఉన్నారు.