జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా శనివారం రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జనబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాచారం దేవాలయం డైరెక్టర్ నాగరాజు, డి పి ఓ దేవకీ దేవి,డిఎల్ పిఓ వేధవతి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.