సేవ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో గజ్వేల్ అంగడి పేట ఆంజనేయ దేవాలయం వద్ద సంస్థ ప్రతినిధులతో కలిసి మట్టి గణపతులను పంపిణి చేసి సేవా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు మాట్లాడుతూ మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి, రాబోవు భావితరాల భవిష్యత్తు కలుషితం లేని నీరు గాలి వాతావరణాన్ని అందించడానికీ ప్రజల్లో చైతన్యం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్లాస్టరాప్యారీస్ గణపతుల వల్ల పర్యావరణానికీ హానికలిగే ప్రమాదం ఉందన్నారు ముఖ్యంగా చెరువులు కలుషితమై జలచరాలకు ప్రమాదం ఉందని అదేవిదంగా మానవాలికీ అనేక రోగాలు వచ్చే అవకాషమున్నారు ఎంతో పెద్దపెద్ద రంగు రంగుల వినాయకులు పెట్టడం ముఖ్యంకాదని భక్తిబావం నింపుకొని నియమ నిష్టలతో పూజలు చేస్తే కుటుంభానికీ సమాజానికీ మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ,గుంటిపల్లి కుమార్ , నాగరాజ్ గౌడ్ పూదరి నర్సింలు , మంత్తూరి నాగరాజుగౌడ్ ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు




