భద్రాచల దేవస్థానం పిలుపు మేరకు కోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనే అవకాశం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం వారికి దక్కింది. ఈ కార్యక్రమం శనివారం సత్యసాయి మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యమానికి ముఖ్య అథితిగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత 25సంవత్సరాల నుండి చేస్తున్నా ఆధ్యాత్మిక సేవను గుర్తించిన భద్రాచల దేవస్థానం వారు కోటి తలంబ్రాల దీక్షను అప్పజెప్పడం రామకోటి రామరాజు ఆధ్యాత్మిక కృషి పట్టుదల ఆమోఘమన్నారు. 100 కోట్ల రామ నామాలు లిఖింపజేసి 1000 కోట్ల రామ నామాలు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి మాట్లాడుతూ ప్రతి వ్యక్తిచే రామ నామాలను లిఖింపజేయడమీ కాకుండా స్మరింపజెసి వారికి ముక్తిమార్గాన్ని చూపించడం రామకోటి రామరాజుకే సాధ్యమన్నారు. కోటి తలంబ్రాల దీక్షలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సామాజిక సమరసత ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికం వైపు నడిస్తే అబద్దానికి తావుండదన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు తలకొక్కుల దుర్గాప్రసాద్, రహీంతో పాటు సంస్థ ప్రతినిధులు కల్లూరి రాములు, జగ్గారి శ్రీహరి, మాలే శంకరయ్యా, రాచకొండ శ్రీనివాస్, గుంటుకు శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, యూత్ లీడర్ తలకొక్కుల ప్రేమ్, మల్లన్న స్వామి, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
