ప్రాంతీయం

కొత్త ఈఎస్ఐ భవనాలను నిర్మించాలి

62 Views

కొమురం భీం జిల్లా

*పాత ESI హాస్పిటల్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించాలి :సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు*

*న్యూ ఢిల్లీ*: ఈ రోజు న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో గల కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖలో కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రివర్యులు కుమారి శోభా కరంద్లాజే గారిని ఆసిఫాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు డా. కొత్తపల్లి శ్రీనివాస్ గారితో సహా కలిసిన సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు.

*ఈ సందర్భంగా వారు కాగజ్ నగర్ పట్టణంలోని పాత ESI ఆస్పత్రి శిధిలావస్థకు చేరుకుందని, వెంటనే దాని స్థానంలో కొత్త భవనం నిర్మించి కార్మిక లోకానికి అండగా నిలవాలని కోరారు. మంత్రిగారు స్పందిస్తూ తప్పకుండా ఈ విషయంలో చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.*

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్