అనారోగ్యంతో మృతిచెందిన బెస్త పద్మయ్య
అంత్యక్రియల ఖర్చులకోసం 5000/- రూ.లు ఆర్థిక సహాయం చేసిన స్థానిక సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి
గ్రామంలో ఎవరు చనిపోయిన ప్రతి కుటుంబానికి తన వంతుగా 5000 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్న సర్పంచ్
తోటి మిత్రుడు మానుక కిషన్ 1000/- రూ.ల ఆర్థిక సహాయం
సమయానికి భోజనం చేయక మృతి చెందిన బెస్త పద్మయ్య
మృతుని భార్య పది సంవత్సరాల క్రితం మరణించింది, ఉన్న ఒక్క కూతురికి వివాహం జరిగి అత్తవారింటి వద్ద ఉంటుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో బెస్త పద్మయ్య(50) అనారోగ్యంతో నేడు ఉదయం 8:00 గంటలకు మృతి చెందాడు,బెస్త పద్మయ్య కు ఒక కూతురు స్వర్ణలత ఉన్నారు, కూతురికి 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగి అత్తారింటి వద్ద నివాసం ఉంటుంది, భార్య పద్మ 10 సంవత్సరాల క్రితం మరణించింది, వీరిది నిరుపేద కుటుంబం వ్యవసాయ భూములు కానీ ఆస్తిపాసులు కానీ లేవు, ఇంటిలో ఒక్కడే ఉంటున్నాడు సమయానికి వంట చేసుకుని భోజనం చేసేవాడు కాదు,మద్యం సేవించేవాడు,అప్పుడప్పుడు తన అన్న కుమారుల వద్ద భోజనం చేసేవాడు,నేడు ఉదయం తలుపులు తెరిచి చూసేసరికి కొన ఊపిరితో ఉన్న పద్మయ్యను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడానికి 108 కు ఫోన్ చేయగా వెంటనే అంబులెన్స్ గృహానికి చేరుకుంది పల్స్ రేట్ పూర్తిగా పడిపోవడంతో అప్పటికే పద్మయ్య మృతి చెందాడు ఇట్టి విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి మృతుని కుటుంబానికి చేరుకొని అంత్యక్రియల ఖర్చులకోసం 5000 రూపాయల ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు, మృతుని తోటి మిత్రుడు మానుక కిషన్ 1000/- రూ.ల ఆర్థిక సహాయం అందజేశారు దయమాయనీయులు ఎవరైనా ఉంటే ఆర్థిక సాయం చేయగలరని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు
