కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.మండలం లోని మాంధపూర్ ,పలుగుగడ్డ గ్రామల్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమం ను శుక్రవారం స్థానిక సర్పంచ్ లు లింగాల భిక్షపతి, శ్రీపతి రాజేశ్వరి రవి తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మాజీ సర్పంచ్ నర్సింలు,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఎల్లేష్, బీఆర్ ఎస్ గ్రామ అధ్యక్షుడు జహంగీర్,కనకయ్య,యువరాజు,శ్రీను,వెంకటేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.