ప్రాంతీయం

సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన హైకోర్టు

136 Views

అక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7
తెలంగాణలో అక్టోబర్ 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 27 న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.

సింగరేణి ఎన్నికలు ఆరు జిల్లాల్లో జరగనుండగా,ఇందులో 3 జిల్లాలలో నక్సల్స్ ప్రభావం ఉంది. అసెoబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలకు నిర్వహణ కష్టం అవుతుంది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీ లు కూడా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు.

గత అక్టోబర్ నుంచి సింగరేణి యాజమాన్యం వాయిదా అడుగుతూనే ఉంది. 43 వేల మంది ఓటర్ల జాబితా ఆల్రెడీ రెడీ అయ్యింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా అడిగారని,కేంద్ర ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపించడం జరిగింది.

వాదనలన్నింటినీ విన్న హైకోర్టు సింగరేణి ఎన్నికలను వాయిదా వేసింది. డిసెంబర్ 27న తిరిగి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *