
జగదేవపూర్ మండల కేంద్రం లోని కలెక్టర్ వెంకట నరసింహరెడ్డి గారి తల్లి ఇట్టిరెడ్డి జనాబాయి రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే కాగా గురువారం రాష్ట్ర మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు, కలెక్టర్ వెంకట నరసింహా రెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
ఇట్టిరెడ్డి జనాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆయన వెంట రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి,ఎంపీపీ బాలేశంగౌడ్,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,మండల నాయకులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




