ప్రాంతీయం

దళిత ఎమ్మెల్యేను అవమానపరిచిన అధికార పార్టీ

135 Views

దళిత ఎమ్మెల్యేను అవమానపరిచిన అధికార పార్టీ
-ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం దళిత జాతికే అవమానం

కంటోన్మెంట్ దళిత ఎమ్మెల్యే
సాయన్న గత ఆదివారం రోజున మృతి చెందిన విషయం తెలిసినదే నని బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ అన్నారు. అధికార పార్టీ సాయన్న దహన సంస్కరణలు ప్రభుత్వ లాంచ నాలతో జరుపుతామని అధికార మంత్రి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి దళితుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని బిఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి అనాజిపూర్ సంజీవ్ అధికార పార్టీని హెచ్చరించారు. మాయమాటలు చెప్పి దళితులను మోసం చేయడం ఇక సహించమని వారన్నారు. రాబోయే రోజుల్లో బిఎస్పి పార్టీ మరింత ఉధృతం అయి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆగడాలను అక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పి దుబ్బాక నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ముల్లం రాజేష్, రాయపోల్ మండల అధ్యక్షుడు సొక్కం స్వామి, దౌల్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాములు ,సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *