ప్రాంతీయం

డిగ్రీకళాశాల ఏర్పాటు చేయడంలో జాప్యం ఎందుకని కేటీఆర్ ను

99 Views

 ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 11, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుపై ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు మిడిదొడ్డి భాను మాట్లాడుతూ హామీ ఇచ్చిన మంత్రి సంవత్సరకాలం గడిచిపోతున్న డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడంపై ముస్తాబాద్ మండల విద్యార్థులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. హామీలు ఇచ్చి మరిచే ఘనత ఈరాష్ట్ర ప్రభుత్వానికే చెల్లుతుందని, ఇచ్చిన మాట ప్రకారం ఈవిద్యా సంవత్సరంలోనే డిగ్రీ కళాశాల తరగతులు నిర్వహించాలని, లేని పక్షంలో రానున్న రెండు మూడు రోజుల్లో రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించి నిరసన తెలియజేసి, మంత్రి కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *