ప్రాంతీయం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల వినతి పత్రం.

180 Views

ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి.

ముస్తాబాద్, సెప్టెంబర్13,మండల కేంద్రంలో అధిక సంఖ్యలో విద్యార్థులు విద్యకు దూరమై పరిస్థితి ఏర్పడతా ఉందిని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో ఆధ్వర్యంలో తాసిల్దార్ గణేష్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్  మాట్లాడుతూ మండలంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక ప్రైవేట్ ,కార్పొరేట్ కళాశాలలో ఫీజులు కట్టలేక అనేక మంది విద్యార్థులు విద్యను మధ్యలోనే ఆపివేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు సిద్దిపేట, కరీంనగర్, కామారెడ్డి , గంబీరావ్ పేట , హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గతంలో ముస్తాబాద్ మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీఇచ్చి మాట నిలబెట్టుకోలేక పోయారు. తక్షణమే ప్రజా ప్రతినిధులు అధికారులు మేలుకొని మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయవలసిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను మేధావులను ప్రజలను తల్లిదండ్రులను కలుపుకొని భారీ ఎత్తున ఉద్యమాలు ఉదృతం చేస్తామని ఈసందర్భంగా హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బప్పా సాయి చరణ్, కొప్పు అభిలాష్ ,ఆదిత్య భాను, విద్యార్థులు తదరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *